బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల జరిగిన విషాద ఘటనల్లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ముందుగా బావుసాయిపేట గ్రామానికి చెందిన పోకల మధుకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అనంతరం నిమ్మపల్లి గ్రామానికి చెందిన తోట స్వప్న అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. అలాగే వెంకట్రావుపేట గ్రామానికి చెందిన శ్రీకాంత్–పవిత్ర దంపతుల రెండు నెలల చిన్నారి అనారోగ్యంతో మృతిచెందగా, ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.






