11 July, 2026 | 10:38 PM

సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత

11-07-2026 09:32 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయం కు శనివారం ప్రముఖ రైస్ మిల్, ఆయిల్ మిల్ వ్యాపారవేత్త  పల్లా శ్రీరాములు అనసూయ, వారి కొడుకు కోడలు సంతోష్ అలేఖ్య దంపతులు రూ.26 వేల విలువ గల  లలితాంబ అమ్మవారి ఉత్సాహ విగ్రహాన్ని శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, అర్చకులు వల్ల కొండ మఠం రమేష్  దంపతులకు ఉత్సవ విగ్రహాన్ని అందజేసినారు.

ఈ కార్యక్రమంలో అమ్మవారికి విశేష అభిషేకం అలంకరణ, ఓడి బియ్యం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం అనంతరం వచ్చిన మహిళా భక్తులచే లలితా సహస్రనామపారాయణం జరిగినది అనంతరం అర్చకులు వల్ల కొండ రమేష్  తీర్థ ప్రసాదములు వచ్చిన మహిళలు , భక్తులకు అందజేశారు, లలితాంబ అమ్మవారి విగ్రహాన్ని అందజేసిన దంపతులను చైర్మన్, అర్చకులు అభినందించి సన్మానించారు,  ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు మరియు భక్త బృందం పెద్ద ఎత్తున  భక్తులు పాల్గొన్నారు.