ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో
ముకరంపుర,(విజయక్రాంతి): ఐవీవై, సిద్ధార్థ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రోబోటిక్స్, ఏఐ ఎక్స్ పో ఆకట్టుకుంది. తెలంగాణ హెల్త్ ప్యానల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేప్టెన్ డాక్టర్ విజయ్ కుమార్ బోడసింగు ముఖ్యఅతిథిగా హాజరై ఎక్స్పోన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రావ్ ఏఐ నిపుణుల బృందం విద్యార్థులు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సెన్సార్ టెక్నాలజీ, ఆటోమేషన్, డ్రోన్ సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ నివారణ, డిజిటల్ భద్రత, సెల్ఫ్ లర్నింగ్, ఏఐతో పాటు లర్నింగ్ భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు వంటి అనేక ఆధునిక సాంకేతిక అంశాలను ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఐవీవై విద్యాసంస్థల వ్యవస్థాపకులు పసుల మహేష్, కో చైర్మెన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ పసుల జయశ్రీ, ప్రిన్సిపల్ కె లలిత, కోల మాలతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






