పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం
20-04-2026 12:00 AM
సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 19: మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో విశేష సేవలు అందించిన సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్ రాష్ట్రస్థాయి గుర్తింపును పొందారు. ఆపరేషన్ స్త్మ్రల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించినందుకుగాను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మల్లేశం గౌడ్ కు అభినందనలు తెలియజేశారు.






