24 March, 2026 | 8:03 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

ప్రజలకు అండ కమ్యూనిస్టులే

24-03-2026 12:30 AM

మున్సిపల్ కార్మికుల మహాధర్నాలో సీపీఐ ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్, మార్చి 23(విజయక్రాంతి): ప్రజలకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని, ఒకప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించేవారే, ఇప్పుడు కష్టసమయంలో కమ్యూనిస్టుల మద్దతు కోరుతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలలో  కాంట్రాక్ట్, ఔట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారికి కనీస వేతనం కింద ప్రతినెల రూ.26 వేలు ఇవ్వడంతో పాటు పర్మినెంట్ కార్మికులకు నాలుగు డిఏలు చెల్లించి, 

పీఆర్సి వెంటనే ప్రకటించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ)  ఆధ్వ ర్యంలో  సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ‘మున్సిపల్ కార్మికుల మహాధర్నా’ నిర్వహించారు.

ఈ ధర్నాకు మద్దతుగా  కూ నంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగిస్తూ తాను ఈ ధర్నాకు ఎమ్యెల్యేగా  రాలేదని, మీలో ఒక్కడిగా వచ్చానని అన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితమే కొత్తగూడెంలో మున్సిపల్ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. మున్సిపల్ పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ ఉద్యోగులు సమానంగా పని చేస్తారని, వారికి వేలల్లో జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వాలు, వీరికి మాత్రం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎస్. బాల్ రాజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే.  రవిచంద్రన్, ప్రధాన కార్యదర్శి కే.  ఏసురత్నం రాష్ట్ర కార్యదర్శులు, వనంపల్లి జైపాల్ రెడ్డి, కాంతారావు, హరినాథ్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర  ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఓమయ్య, విలాస్, పళ్ళ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, నారాయణరెడ్డి, ధర్మరాజు, సారంగపాణి, బోట్ల బిక్షపతి, శ్రీనివాస్, టి ఆనంద్, చందు, వినయ్, చంద్రమోహన్, సురేష్, శ్రీకాంత్, రాయపూడి శ్రీను, కిషోర్, జంగయ్య, సంజీవ, సంతోష, లక్ష్మి, అండాలు, కమల, ఎల్లమ్మ, మహేశ్వరి, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.