కార్గో లాజిస్టిక్స్ విభాగము మార్పు
17-06-2026 03:00 PM
ముకరంపుర, జూన్ (విజయక్రాంతి): కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో ఇదివరలో ఉన్న కార్గో, లాజిస్టిక్స్ విభాగంలో వినియోగదారులు తమ సేవలు పొందుటకు గాను బస్సులు బస్ స్టేషన్ లోకి వచ్చు మార్గంలో లోపలికి వచ్చి తమ కార్యకలాపాలు కొనసాగించేవారు. ఇలా బస్సులు లోపలికి వచ్చే మార్గంలో కార్గో వినియోగదారులు రావడం సురక్షితం కాదని వారి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న కార్గో, లాజిస్టిక్స్ విభాగాన్ని బస్ స్టేషన్ లోని అలైటింగ్ ప్లాట్ ఫారాల వైపు తరలించబడింది. కావున కార్గో, లాజిస్టిక్స్ సేవల వినియోగదారులు కరీంనగర్ బస్ స్టేషన్ ప్రయాణికులు ప్రవేశ ద్వారం లోనికి వచ్చి కార్గో సేవలను వినియోగించుకోవాలని కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి రాజు తెలియజేశారు.






