17 June, 2026 | 4:27 PM

గొర్రెల మృతి ఘటన బాధిత కుటుంబానికి షబ్బీర్ అలీ ఆర్థిక సాయం

17-06-2026 03:06 PM

భిక్కనూర్, జూన్ 17(విజయ క్రాంతి):  భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాందూరి సాయిలుకు చెందిన 140 గొర్రెలు మృతి చెందిన ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తగిన నష్టపరిహారం అందించడంతో పాటు మిగిలిన గొర్రెలకు వెంటనే వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బస్వాపూర్ సర్పంచ్ తుడుం పద్మ, భిక్కనూర్ సర్పంచ్ రేఖ, గుర్జకుంట సర్పంచ్ సంతోష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఎంఆర్ఓ సునీత, వెటర్నరీ అధికారులు,మండల అధికారులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.