పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించిన గజభీంకార్ రాజన్న
తంగళ్ళపల్లి జూన్ 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో పానీపూరి తిని అస్వస్థతకు గురైన 24 మంది చిన్నారులను మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న పరామర్శించారు. నిన్న సాయంత్రం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి చిన్నారుల యోగక్షేమాలను తెలుసుకున్నారని తెలిపారు. చిన్నారులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో , 5 వా వార్డ్ మెంబర్ కల్వకుంట్ల రోజా నాగేశ్వరరావు, అల్వాల సాయి,తాటిపాముల లచ్చన్న, కొక్కుల మహేష్, శ్రీనివాస్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






