17 June, 2026 | 4:10 PM

తక్కువ నీటి పంటలతో నే ఎల్ నినోకు చెక్

17-06-2026 02:54 PM

వ్యవసాయ అధికారి వి.గీత

నంగునూరు,(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఆలస్యమై,సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి వి.గీత అన్నారు. మండల పరిధిలోని ఘనపూర్ లో బుధవారం ఎల్ నినో పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ వరి సాగుపైనే ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ ను పాటించాలని సూచించారు.

వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా కందులు, పెసర్లు, మినుములు, జొన్నలు, సజ్జలు, నువ్వులు వంటి తక్కువ నీటి అవసరమున్న స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలని కోరారు. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకోవాలని, దీని ద్వారా వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించుకొని ఆదాయ భద్రత పొందవచ్చని పేర్కొన్నారు. అనంతరం రైతులకు అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ పరుశరాములు, వ్యవసాయ విస్తరణ అధికారి బి.ప్రవళిక, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.