అనాథ శవానికి అంత్యక్రియలు
17-06-2026 02:59 PM
ఆదిలాబాద్, జూన్ 17 (విజయక్రాంతి) : మానవత్వం మంటగలిసిపోతున్న నేటి తరుణంలో ఓ అనాధ శవానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆదిలాబాద్ చెందిన సేవ సమితి సభ్యులు. తలమడుగు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ వ్యక్తి మృతి చెందగా సంబంధీకులు ఎవరు రాకపోవడంతో పోలీసులు మానవ సేవయే మాధవ సేవ సమితి సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కానిస్టేబుల్ సంతోష్ తో కలిసి సమితి సభ్యులు శశికళ చౌహాన్, గణేష్ వర్మ, కనక నర్సింగ్, రాధేశ్యం, స్వప్నిల్ లు ఆదిలాబాద్ లోని స్మశాన వాటికలో హిందూ సాంప్రదాయ ప్రకారం అనాథ శవానికి అంత్యక్రియలు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.






