కామన్ స్కూల్ విధానంతోనే మేలు
ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లతో పేద వర్గాల పిల్లలకు ఒరిగేది ఏమీ లేదని, కామన్ స్కూల్ విధానంతోనే మేలు జరుగుతుందని తెలం గాణ విద్యా పరిరక్షణ కమిటీ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యా విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించలే దన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ కార్పొ రేటీకరణ ఆలోచన విధానంతో రిపోర్టు ఇచ్చిందని, అందులో మానవీయ విలువలు లోపించాయన్నారు. రిపోర్టులో కొన్ని మంచి సూచనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని ఆచరణకు పెట్టకుండా కేశవరావు కమిటీకి అప్పగించడం సరైనది కాదని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఒక్కో స్కూల్‌కు 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో నిర్మిం చేందుకు 3500 కోట్ల రూపాయలు కేటా యించడమనేది కేవలం కాంట్రాక్టర్ల లాభాల కోసమే అని పేర్కొన్నారు. బడ్జెట్‌లో కనీసం 18 శాతం నిదులు ప్రభుత్వ విద్యకు కేటా యించాలని డిమాండ్ చేశారు.
కామన్ స్కూల్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూన్ 5వ తేదీన హైద రాబాద్‌లో ర్యాలీ, ధర్నా నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో విద్యాపరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చకినాల అనిల్‌కుమార్, నన్నెబోయిన తిరుపతి, డీటీ ఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, టి.లింగారెడ్డి, విద్యాపరిరక్షణ కమటీ అసోషియేట్ అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






