16 May, 2026 | 6:22 AM

పేదలకు కొండంత అండ సీఎం సహాయనిధి

16-05-2026 01:13 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి

మాడ్గుల, మే 15(విజయక్రాంతి): ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం, ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాడ్గుల మండలం నల్లవారిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ భార్యను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.5,000 తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.