23 May, 2026 | 2:20 AM

యూసీఎఫ్ నిధులు మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి

23-05-2026 12:00 AM
  1. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి
  2. రూ :630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంద
  3. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కరీంనగర్ క్రైం, మే22(విజయక్రాంతి):అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీం లో భాగంగా కరీంనగర్ పట్టణ అభివృద్ధికి 840 కోట్ల రూపాయలు మంజూరైనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ద్వారా మంజూరుకి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి,

సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపడుతోందని కరీంనగర్ పట్టణ అభివృద్ధికి 840 కోట్లు మంజూరు కావడం అందులో కేంద్ర ప్రభుత్వం వాటా పోను మిగితా 630 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు హడ్కో నుండి రుణం తీసుకొని అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటూ కరీంనగర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అభినందించాల్సిన అవసరం ఉందన్నారు.గత స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా మిగిలిన 140 కోట్ల భాగస్వామ్యంలో 70 కోట్లు రాష్ట ప్రభుత్వ వాటా మంజూరు చేసిందని ప్రాజెక్ట్ ముగిసిపోవడం తో కేంద్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు ఇవ్వలేకపోయిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ డ్బ్బు కోట్లతో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ పార్కింగ్ వరదలు వచ్చినప్పుడు నిలిచే ప్రాంతాలలో పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి వినియోగిస్తారని నరేందర్ రెడ్డి అన్నారు.యుసిఎఫ్ నిధుల వల్ల నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి సహరించండని ప్రధానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కి లేఖలు ఇవ్వడం జరిగిందని అవ్వి కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్యుల అంజన్ కుమార్,కాంతలా జగన్ రెడ్డి,పాడిశేటి భూమయ్య,చాడగొండ బుచ్చిరెడ్డి, గుండటి శ్రీనివాస రెడ్డి,పెద్దిగారి తిరుపతి,బషీర్,సుదర్శన్, హనీఫ్,జిల్కర రమేష్ తదితరులు పాల్గొన్నారు.