20 June, 2026 | 4:04 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

ముదిరాజ్‌ల సంక్షేమానికి సీఎం ప్రాధాన్యం

03-01-2026 12:00 AM
  1. ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్
  2. కాంగ్రెస్‌లో చేరిన దుర్గేష్, ఆయన అనుచరులు 

కేసముద్రం, జనవరి 2 (విజయక్రాంతి): ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్ నీలం సుహ సిని దుర్గేష్ బీఆర్ ఎస్‌ను వీడి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కేసముద్రం నుంచి దురేష్ తన అనుచరులతో పెద్ద ఎత్తు న హైదరాబాద్ తరలి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తొలుత కేసముద్రం పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ముదిరాజ్ కులస్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వె నుకబాటుకు గురైన ముదిరాజ్ కులస్తుల అభివృద్ధి కోసం తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించికున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ సహకారంతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు.  కాంగ్రెస్‌లో చేరిన వారిలో కేసముద్రం మండలలానికి చెందిన  వారూ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళినాయక్ తదితరులు పాల్గొన్నారు.