20 June, 2026 | 4:19 PM

Breaking News

కెరమెరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి   •   గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •  

'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం

20-06-2026 02:55 PM

* కరణం శోభమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా అందజేత

పాపన్నపేట: మండల పరిధిలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పది పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులకు కరణం శోభమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా శనివారం పాఠశాలలో నగదు ప్రోత్సాహకం అందజేశారు. కరణం గోపాల్ కిషన్ రావు చేతుల మీదుగా ప్రథమ బహుమతిగా అవినాష్ కు రూ.10వేలు, ద్వితీయ బహుమతి దుర్గాప్రసాద్ కు రూ.5వేలు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకులు కరణం అనంతరావు, స్థానిక సర్పంచ్ పద్మా జగన్నాథం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూజాత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.