4 May, 2026 | 12:51 PM

Breaking News

బెంగాల్ బీజేపీదే.! భవానీ పూర్‌లో ఆధిక్యంలో మమతా బెనర్జీ   •   22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •  

లేబర్ కోడ్లను కేంద్రం రద్దు చేయాలి

16-03-2026 12:16 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని భారత కార్మిక సం ఘాల సమాఖ్య  రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి చాంద్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం అసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్‌లో  పోస్టర్లను విడుదల చేశారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా, పార్లమెంట్లో సమగ్ర చర్చలు జరపకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నా రు.

ఈ నేపథ్యంలో మార్చి 16న (నేడు) కలెక్టరేట్ల ముట్టడి, 23న హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే భారీ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  నాయకులు వీరన్న, జాడి తిరుపతి, అఖిల్, పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, మండల నాయకులు సమీర్, తరుణ్, కార్మికులు బాబా, రాజన్న పాల్గొన్నారు.