కేంద్రం హామీలు నిలబెట్టు కోవడం లేదు!
- నిరసనకారులపై కేసులు ఎత్తివేయాలి
- 28 గంటల్లో స్పందించకపోతే మళ్లీ ఉద్యమిస్తాం
- సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ హెచ్చరికలు
న్యూఢిల్లీ, జూలై ౨౭: ‘కేంద్ర ప్రభుతవ మాకు హామీలు నిలబెట్టుకోవడం లేదు. నిరసనకారులపై కేసులు ఎత్తివేయలేదు. స్పం దించకపోతే మళ్లీ ఉద్యమిస్తాం’ అని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ హెచ్చరించారు. సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. నిరసనకారులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తామని హామీ ఇస్తేనే, తాము ఉద్యమాన్ని విరమించుకున్నామని.. కానీ, కేంద్రం ఇప్పుడు ఆ హామీలు పట్టించకోవడం వలేదని వాపోయారు.
ఒక్క ఢిల్లీలోనే కాక అసోం, బంగాల్, బీహార్ వంటి ఎన్నో రాష్ట్రాల్లో యువత ఉద్యమించారని, ఆయా చోట్ల వేలాది మందిపై కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. ఎంతోమంది పోలీసుల అదుపులో ఉన్నారని, వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేం ద్ర సింగ్ మరోసారి జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరిం చాలని కోరారు. అక్రమ అరెస్టులు, కేసుల వ్యవహారంపై తాము అడ్వొకేట్లతో చర్చలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం లోపు కేంద్రం స్పందించి కేసులు ఎత్తివేయకపోతే, తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.






