19 May, 2026 | 1:28 AM

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి

19-05-2026 12:22 AM

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ

సత్తుపల్లి, మే 18 (విజయక్రాంతి): పేదలు సామాన్యులపై బారాలు పడే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని సిపిఐ సత్తుపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రింగ్ సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీజిల్ పెట్రోల్ వంటగ్యాస్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయని దీనివలన నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుడు.

బడుగు బలహీన వర్గాల ప్రజలు బతకడం కష్టంగా మారిందని పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ అనేకసార్లు ధరల మీద ధరల పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచే చర్యలకు పాల్పడుతున్నారని ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పొదుపు చర్యలు పాటించాలని సూక్తులు చెప్పిన ప్రధానమంత్రి ఎన్నికల రిజల్ట్ రావడంతోనే సామాన్య మధ్యతరగతి పేద ప్రజలపై పెను భారం పడే0 గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరల పెంచి ఆయన యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టారని దండు ఆదినారాయణ విమర్శించారు.

ఈ దేశంలో పేదలు సామాన్యులు బడుగు బలహీనవర్గాలంటే గిట్టని మోడీ వారిపై బారాలు పెంచుతూ అదా నీ అంబానీ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారని దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి నిసిగ్గుగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తడికమళ్ళ యోగు సత్తుపల్లి పట్టణ సహాయ కార్యదర్శి పాలకుర్తి వీరయ్య టౌన్ కమిటీ నాయకులు కోలేటి వెంకటేశ్వరరావు ఆటో యూనియన్ అధ్యక్షులు చెరుకు కేశవరావు మేంసూరు మండల నాయకులు ఎస్.కె లాల్ మహమ్మద్ ఫుట్పాత్ వ్యాపారుల సంఘం నాయకులు ప్రభాకర్ కృష్ణ దయామని మరియమ్మ శాంతమ్మ లక్ష్మీ  జ్యోతి వెంకటమ్మ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు