28 July, 2026 | 1:49 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉక్కపోత

19-05-2026 12:21 AM

ఫ్యాన్లు లేక రోగులకు తీవ్ర ఇబ్బందులు

వనపర్తి టౌన్, మే 18 : ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి లో  రేడియోలజి, ఎక్సరే, స్కానింగ్ దగ్గర వేచిచోట్ల సరిపడా ఫ్యాన్లు లేకపోవడంతో రోగులు, వారి బంధువులు చెమటలు కారుస్తూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వేసవి తీవ్రత దృష్ట్యా ఆసుపత్రిలో వెంటనే ఫ్యాన్లు ఏర్పాటు చేసి, మరింత సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.