22 April, 2026 | 1:28 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి

22-04-2026 12:00 AM

తెలంగాణ రాష్ట్ర జన గణన డైరెక్టర్ భారతి హోలీకెరీ

మెదక్, ఏప్రిల్ 21(విజయ క్రాంతి) : జనగణన - 2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని జనగణ డైరెక్టర్ భారతి హోలీకెరీ అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జనగణ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జనగణన 2027 లో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ విధానం, స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) పై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు  జన గణనకు సంబంధించిన కిట్లను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి దశలో మే 11 వ తేదీ నుంచి జూన్ 09 వ తేదీ వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027 లో వ్యక్తుల వారిగా సమాచారం సేకరిస్తారని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించి.. నమోదు చేయాలని ఆదేశించారు.

అందరి వివరాలు గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. ఎండాకాలం నేపథ్యంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీటి బాటిల్ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నెల 26 వ తేదీన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)  చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశించారు.

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణలో ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ప్రతిమా సింగ్, మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.