సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలి
ముషీరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు బుధ వారం చిక్కడపల్లి వివేక్ నగర్ సమీపంలోని పెండెకంటి లా కాలేజీ, ఆంధ్ర విద్యాలయ పాఠశాల వద్ద జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ ఫండ్స్ రూ. 1 కోటీలో భాగంగా రూ.12 లక్షల నిధులతో గతంలో ప్రారంభించిన నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులను మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ స్థానికులతో కలిసి సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా దుకాణ దారులకు, పాదచారులకు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వెంటనే రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, పి. నర్సింగ్ రావు, ఆనంద్ రావు, సాయి కుమార్, సత్యేంధర్, ప్రశాంత్, స్థానికులు శాలిని, తులసి, రాజు, కె. శ్రీకాంత్, మల్లేష్, రాఘవేందర్ పాల్గొన్నారు.






