ఆర్టీసీ సమ్మెకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మద్దతు
23-04-2026 12:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22: (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 32 డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె బాట పట్టారని సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్ తెలిపారు.
ఈ పోరాటం కేవలం జీతభత్యాల కోసమే కాకుండా, రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ నుండి కాపాడుకునే యత్నమని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరు తో రూట్లను ప్రైవేటీకరించడం, సంస్థ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల భవిష్యత్తులో చార్జీలు పెరగడం, రాయితీలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు తొలగించే వరకు సమ్మెకు మద్దతు ఉంటుందని ప్రకటించారు.






