23 April, 2026 | 5:33 PM

రంగారెడ్డి జిల్లా జూడో అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం

23-04-2026 12:00 AM

మేడిపల్లి ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా జూడో అసోసియేషన్ నూత న కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అజీజ్ పర్యవేక్షణలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధి లో ఫిర్జాదిగూడలో జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చైర్మన్‌గా రమేశ్ గౌడ్, అధ్యక్షుడిగా అలీ, ప్రధాన కార్యదర్శిగా రాము, కోశాధికారిగా రవీన తదితరులను ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులు సంయు క్త కార్యదర్శులు కార్యవర్గ సభ్యులతో కలిసి మొత్తం 23 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ జూడో అసోసియేషన్ నియమ నిబంధనల ప్రకారం ఈ నూతన కార్యవర్గం నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని రాష్ట్ర అధ్యక్షు లు. కైలాష్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో జూడో అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధు లు సంతోష్ కుమార్ సైదులు పాల్గొన్నారు.