12 August, 2026 | 3:19 AM

ఎస్సారెస్పీలో 43.10 టీఎంసీలు తగ్గిన ఇన్ ఫ్లో

12-08-2026 12:41 AM

అర్మూర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి) : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో కొనసాగుతోంది.ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలో,  ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో  ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో క్రమంగా తగ్గింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు 80.5 టిఎంసిలగాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1079.30 అడుగులకు 43.10 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టులోకి సుమారు మూడు వేల 500  క్యూసెక్కుల వరకు వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 1013 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, ఎవాబిరేషన్  482 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231  క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.