12 August, 2026 | 3:19 AM

పరిశుభ్రతతోనే వ్యాధులకు చెక్

12-08-2026 12:43 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి

హుస్నాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధులకు చెక్కు పెట్టవచ్చని మున్సిపల్ చైర్ పర్సన్ గండి లక్ష్మి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని 11వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో ‘సఫాయి అప్నా బీమారీ భగావో’ కార్యక్రమం నిర్వహించారు. చైర్పర్సన్ దండి లక్ష్మి, కౌన్సిలర్లు ఇంటింటికీ తిరిగి ప్రజలకు పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నివారణకు పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. ఆరోగ్యకరమైన పట్టణం కోసం ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.కార్యక్రమంలో వైస్త్చ్రర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు పూజారి వరప్రసాద్, బూరుగు లత, కొండ రజిత, పిల్లి తిరుపతి, గడిపే సంపత్, సావుల మంజుల, వైద్యం కిరణ్ ప్రసాద్, గాదెపాక రవీందర్, గోపగోని శోభన్బాబు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.