పచ్చునూరులో అన్నదమ్ముల అనుబంధం
- యదేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జా
- ఉపాధి హామీ నిధుల రికవరీపై కలెక్టర్ కు గ్రామస్తుల ఫిర్యాదు
మానకొండూరు, మే 11 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామంలోని యాదవనగర్ లో దూసోళ్ళ కుంట శిఖం ఎకరం పైచిలుకు ప్ర భుత్వ భూమి గ్రామ మాజీ ఫీల్ అసిస్టెంట్ కూరాకుల పోచాలు కబ్జా చేసి దర్జాజాగా సాగు చేసుకుంటున్నారని పచ్చునూరు గ్రా మస్తులు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు.మాజీ ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ పనికి హాజరు కానీ కొంతమంది కూలీలకు అక్రమంగా హాజరు వేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని తక్షణం నిధుల రికవరీ కి ఆదేశించాలని కో రుతూ ప్రజావాణిలో చేసిన ఫిర్యాదులో గ్రా మస్తులు కోరారు.
పచ్చునూరు గ్రామంలో ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో విధుల నుండి తొలగించిన మాజీ ఫీల్ అసిస్టెంట్ కూరాకుల పోచాలు, ఒకవైపు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహ రిస్తున్న తన తమ్ముడు కూరాకుల శ్రీనివాస్ మల్టిపర్పస్ ఉద్యోగి (కరోబార్) మరోవైపు కలిసి ప్రభుత్వ ధనాన్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు.గతంలో ప్రభుత్వ నిధులను దారిమళ్లించినందుకు,మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించినందుకు గాను మాజీ ఫీల్ అసిస్టె్ంప విచారణ జరిపి, ఆయనను విధుల నుండి తొలగించారు. దుర్వినియో గం చేసిన నిధులను ఇంకా రికవరీ చేయకపోవడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కారోబార్ అక్రమాలు.. ఆధారాలతో సహా ఫిర్యాదు
ఫీల్ అసిస్టెంట్ కూరాకుల పోచాలు తొలగింపు తర్వాత ఉపాధి హామీ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. కానీ, సెక్రటరీ పని ఒత్తిడిలో ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న కారోబార్ కూరాకుల శ్రీనివాస్ కలిసి , క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.తప్పుడు హాజర్లు, పనికి హాజ రుకాని వ్యక్తులకు హాజరు వేస్తూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు.
ఆర్టీఐ (RTI) ఆధారాలు:
పనికి రాకుండానే హాజరు పొందిన వారి వివరాలు, దానిపై మల్టిపర్పస్ ఉద్యోగి చేసిన సంతకాలతో కూడిన జిరాక్స్ కాపీలు ఇప్పు డు సాక్ష్యాలుగా బయటపడ్డాయి. ఇప్పటికే గ్రామసభలో ఈ విషయంపై నిలదీయగా కొంతమందిని తొలగించినా, మల్టిపర్పస్( కరోబార్) ఉద్యోగి తీరు మారకపోవడంతో ఆయన పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల్లో మాజీ ఫీల్ అసిస్టెంట్ రికార్డు అయినా పుటేజ్
విధుల నుండి తొలగించినా మాజీ ఫీల్ అసిస్టెంట్ తీరు మారడం లేదు. దొంగచాటుగా ఉపాధి పనుల వద్దకు వెళ్లి కూలీల హాజరు వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామ సరిహద్దుల్లోని సీసీ కెమెరా లను పరిశీలిస్తే ఆయన ఆగడాలు స్పష్టంగా కనిపిస్తాయని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వడ్ల లారీ లోడింగ్ విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
అన్నదమ్ముల అక్రమాలు, ప్రభుత్వ నిధులను దోచుకుంటున్న మాజీ ఫీల్ అసిస్టెంట్, అతనికి సహకరిస్తున్న మల్టిపర్పస్ ఉద్యోగి( కారోబార్) పై కఠిన చర్యలు తీసుకోవాలని పచ్చునూరు గ్రామస్తులు కలెక్టర్ ను కోరుతున్నారు.






