12 May, 2026 | 2:26 AM

టెన్త్, ఇంటర్ ప్రతిభావంతులకు సన్మానం

12-05-2026 01:27 AM

వరంగల్, మే 11 (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో ఇటీవల ప్రకటించిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభావంతులకు యంగ్ అచీవర్స్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరయ్యారు.

ఈ సందర్భంగా పదో తరగతిలో 550 పైగా, ఇంటర్మీడియట్లో 980 మార్కులకు పైగా సాధించి ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, లక్ష్యసాధన ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేదించేందుకు కృషి చేయాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తే, మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 

కొండా శ్రీయాంష్ మురళీకృష్ణ పటేల్ కు ఘనసత్కారం

చిన్న వయసులోనే ఎమరైజింగ్ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించిన కొండ శ్రీయాంశ్ మురళీకృష్ణ పటేల్ ను ఘనంగా సత్కరించి అభినందించారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డాక్టర్ శ్రీధర్ కుమార్, జిల్లా విద్యాధికారి రంగయ్య నాయుడు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబయ్య, డిఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీవో సుమ పాల్గొన్నారు.