బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి
పార్టీ జిల్లా కార్యదర్శి విప్పర్ల హనుమాన్
ఘట్ కేసర్, జూన్ 7 (విజయక్రాంతి) : బూత్ కమిటీలను మరింత పటిష్టం చేసి, బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి విప్పల హనుమాన్ పేర్కొన్నారు. ఘట్కేసర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ సంస్థాగత అంశాలపై డివిజన్ ఆఫీస్ బేరర్స్, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించబడింది. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విప్పర్ల హనుమాన్ పాల్గొని నాయకులకు,
కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తూ దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్లను మరింత పటిష్టం చేసి, బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు. బూత్ అధ్యక్షులు, బూత్ స్థాయి కార్యకర్తలు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రతి బూత్లో బీజేపీ జెండా రెపరెపలాడేలా విధంగా కృషి చేసి పార్టీ విజయానికి అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు.






