calender_icon.png 18 February, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకెట్ నవల ప్రారంభం

18-02-2026 12:00:00 AM

తమిళ స్టార్ విజయ్ సేతుపతి, ‘రాజాసాబ్’ బ్యూటీ మాళవిక మోహనన్ జంటగా ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. తమిళంలో విలక్షణ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు త్యాగరాజన్ కుమార్‌రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘పాకెట్ నావెల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ కూడా ప్రారంభించేశారు. టైలర్ డర్డెన్ అండ్ కింగ్ ఫిస్ట్ దీన్ని నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇందులో కన్నడ నటుడు రాజ్ బిశెట్టి మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. విలక్షణ నటుడు కిశోర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ మొదలైన సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ‘కొలైగారన్’, ‘వదంది’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆండ్రూ లూయిస్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, యుగభారతి గీత రచయితగా పనిచేస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా, సత్యరాజ్ నటరాజన్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తి స్తున్నారు.