15 March, 2026 | 1:26 AM

ఇదే నెలలో ముహూర్తం!

15-03-2026 12:00 AM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు -బాబి కలయికలో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత మరో చిత్రం రాబోతుంది. ఈ సినిమా చిరు 158వ చిత్రంగా రానుంది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేకు కోన వెంకట్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన ఇటీవల ఓ సందర్భంలో బాబి.. -చిరుతో మామూలు సినిమా చేయడంలేదని, తన సినీ ప్రస్థానంలో టచ్ చేయని సబ్జెక్టును చేయనున్నారని చెప్పారు.

స్వతహాగా బాబీ, చిరుకు వీరాభిమాని. ఇప్పటికే చిరుకు ఒక హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ మరోసారి ఆయనతో సినిమా చేబోతుండటం తో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. ఇదిలావుంటే, ఇప్పటికే ఇందుకు సం బంధించిన అధికారిక ప్రకటన వెలువడి చాలా రోజులైంది.

కానీ, రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయి తే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇదే మార్చి నెల నుంచి ప్రారంభం కాబోతోంది. 

ప్రియమణి ఇందులో హీరోయిన్ కనిపించే అవకాశాలున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వెంకట్ కే నారాయణ్, నిషా వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నారు. ‘వాల్తేరు వీర య్య’ 2023 సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. దీంతో ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నారట మేకర్స్.