16 March, 2026 | 1:00 AM

ధనుష్‌కు జోడీగా..!

15-03-2026 12:00 AM

విభిన్న చిత్రాలతో దక్షిణాదిన తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ ధనుష్. తమిళంతో పాటు తెలుగులోనూ ధనుష్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగులో ఇటీవల శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఆయన నటించిన ‘కుబేర’ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ధనుష్ చేతిలో పలు ఆసక్తికరమైన సినిమాలున్నాయి.

ఇప్పటికే విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కర’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన ఇప్పుడు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం లో రూపొందుతున్న మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే సంగీత దిగ్గజం ఇళయరాజా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్‌లలోనూ ధనుష్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుండగా, తమిళ దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ 56వ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో ‘ఉరియడి’ ఫేమ్ విజయకుమార్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారట. ధనుష్‌కు సంబంధించి ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటించనుంది.

‘కాంతార’, ‘ఏస్’, ‘మదరాసి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తం గా గుర్తింపు పొందింది రుక్మిణి వసంత్.. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్-నీల్ మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. సౌత్‌లో అన్ని భాషల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్న రుక్మి ణి.. ధనుష్ సరసన నటించనుందనే వార్త నిజమైతే, ఆమె కెరీర్‌కు మరో పెద్ద మైలురాయిగా చెప్పొచ్చు.