ప్రపంచ నవ్వుల దినోత్సవంలో డాక్టర్ తోకల రమేష్‌కు ఘన సత్కారం
అశ్వాపురం,(విజయక్రాంతి): నవ్వుల ద్వారా సమాజంలో ఆనందాన్ని పంచే లక్ష్యంతో భాషా సాంస్కృతిక శాఖ–తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో మొగిలి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ నవ్వుల దినోత్సవం–2026 వేడుకలు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. డాక్టరేట్ పొందిన సందర్భంగా డాక్టర్ తోకల రమేష్ సేవలను గుర్తించి “ఆనందోబ్రహ్మ పురస్కారం–2026”ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ సినీ నటుడు, నవ్వుల రారాజు, మాజీ మంత్రి బాబు మోహన్ , తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ స్వయంగా డాక్టర్ రమేష్ కి పురస్కారం అందజేసి సన్మానించారు.
నవ్వులతో, హాస్యంతో నిండిన ఈ వేడుక ప్రేక్షకులను ఆకట్టుకోగా, నవ్వు మనసుకు ఔషధమని, జీవితంలో ఒత్తిడిని తగ్గించే శక్తి కలిగినదని వక్తలు పేర్కొన్నారు. సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ తోకల రమేష్ ప్రజల్లో ఆనందాన్ని పంచడంలో తనదైన గుర్తింపును సాధించారని, ఆయనకు లభించిన ఈ గౌరవం సమాజానికి ఆయన అందించిన సేవలకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ తాను పొందిన ఈ గౌరవం మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో ముందుండి పనిచేస్తానని వెల్లడించారు.






