30 June, 2026 | 10:18 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

జ్యూస్ అని యాసిడ్ తాగించిన చిన్నమ్మ

17-04-2026 12:00 AM

-బాలుడికి చికిత్స చేయించిన తల్లిదండ్రులు

మేడిపల్లి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): మామ ఆదరణ తమ బిడ్డ కంటే తోడికోడలు కొడుకుపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అక్కసుతో నాలుగేళ్ల పసివాడికి యాసిడ్ తాగించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ శ్రీనివా స కాలనీలో ఉండే పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నాగరాజు, జగదీష్ ఉన్నారు.

వారిద్దరికీ వివాహాలై, పిల్లలు ఉన్నారు. వీరంతా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. పెద్ద కుమారుని కొడుకు కార్తీక్ వాసు(4)పై తాత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తన బిడ్డను పట్టించుకోవడం లేదని చిన్న కోడలు మంజుల కక్ష పెంచుకొని, తరచు గొడవలకు దిగేది. ఈ క్రమంలో బాలుడు పై కక్ష పెంచుకొని పలుమార్లు అత్యాయత్నం చేసింది.

ఒకసారి బెడ్ రూమ్‌లో బాలుడి ముక్కు, నోరు, మూసి ఊపిరాడకుండా చేయబోగా తల్లి చూసి అడ్డుకుంది. మరోసారి భవనం పైకి తీసుకెళ్లి ప్రమాదకరంగా రేలింగ్ పై కూర్చోబెట్టగా మామ గమనించి మందలించారు. ఈనెల 9న మంజుల బాలుడుని కిచెన్‌లోకి తీసుకెళ్లి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి యాసిడ్ తాగించింది. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బుధవారం రాత్రి బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.