5 May, 2026 | 8:49 AM

పది ఏళ్లుగా ఖాళీ కుర్చీ

05-05-2026 01:05 AM

ఆయుర్వేద వైద్యం లేక 20 గ్రామాల ప్రజల ఆవేదన 

తిరుమలాయపాలెం, మే 4 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని సుబ్లేడు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద వైద్యం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద వైద్యానికి గదులు ఉన్నప్పటికీ వైద్యుడు లేక కుర్చీ ఖాళీగానే ఉండటం పరిస్థితి దారుణంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత పది సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్య సేవలు నిలిచిపోవడంతో చుట్టుపక్కల ఉన్న సుమారు 20 గ్రామాల ప్రజలు ఆయుర్వేద వైద్యం కొరకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.  నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించాలని సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఉన్నతాధికారుల సమక్షంలో సుబ్లేడు గ్రామ మాజీ సర్పంచ్ మందడి ఇజ్రాయిల్ వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే స్పందించి ఆయుర్వేద వైద్యుని నియమించి ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు