బయ్యారం గ్రామంలో నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే
పినపాక, మే 4, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం గ్రామంలో బయ్యారం, పాతరెడ్డిపాలెం, వెంకట్రావుపేట, చింతల బయ్యారం, జగ్గారం గ్రామాల ప్రజల రవాణా సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసును పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీ ణ ప్రాంతాల అభివృద్ధికి రవాణా సౌకర్యాలు కీలకమని, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు సులభంగా ప్రయాణించేందుకు ఈ బస్సు సర్వీసు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






