27 July, 2026 | 4:54 PM

టీజీసీజీటీఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక

27-07-2026 04:25 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) మంచిర్యాల జిల్లా కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. టీజీసీజీటీఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మొరుపుటాల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ తన్నీరు సురేష్ లు ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సంబంధించి అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అధ్యక్షుడిగా డాక్టర్ సంతోష్ కుమార్, కార్యదర్శిగా జాడి శంకరయ్య, మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా డాక్టర్ గోపాలకృష్ణ, చెన్నూర్ ప్రభుత్వడిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా డాక్టర్ రామకృష్ణలు ఎన్నికయ్యారు. మంచిర్యాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర హరీష్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.