21-02-2026 11:09:21 AM
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్(US-Iran war) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ పై దాడులకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వెల్లడించారు. అణు ఒప్పందంపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్ తమతో కలిస్తే మంచిదని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. రేపటి నుంచి ఇరాన్ పై యుద్ధం మొదలుకావచ్చని పెంటగాన్ తెలిపారు. అమెరికా దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది. యుద్ధానికి ఇరుదేశాలు సన్నాహాలు దాదాపు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.