18 April, 2026 | 3:01 AM

రాహుల్‌పై కేసు నమోదు చేయండి

18-04-2026 12:00 AM
  1. యూపీ ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు
  2. రాహుల్ ద్వంద్వ పౌరసత్వంపై బీజేపీ నేత శిశిర్ పిటిషన్‌పై విచారణ

లక్నో, ఏప్రిల్ ౧౭: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ద్వంద్వ పౌరసత్వం (డ్యుయల్ సిటిజిన్‌షిప్)పై విషయంలో కేసు నమోదు చేయాలని శుక్రవారం అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా దర్యాప్తు నిర్వహించాలని లేదంటే, ఏదైనా ఒక కేంద్ర సంస్థకు దర్యాప్తు అప్పగించాలని ఆదేశించింది.

రాహుల్ బిట్రన్, భారత పౌరసత్వా లు కలిగి ఉండటంపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. బిట్రన్‌లో ఆయనకు పౌరసత్వం ఉంది కాబట్టి భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత విఘ్నేశ్ శిశిర్ లక్నో ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్‌ను లక్నో న్యాయస్థానం తోసిపుచ్చింది. శిశిర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని ఆదేశించింది.