calender_icon.png 23 February, 2026 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దశంకరంపేటలో ఉద్రిక్తత

23-02-2026 02:02:21 AM

బాన్సువాడ వెళ్లకుండా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బీజేపీ, హిందూ సంఘాల నిరసన

బస్సు అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు

మెదక్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మెద క్ జిల్లా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట సమీ పంలోని కింగ్స్ 9 రెస్టారెంట్ వద్ద ఉదయం సుమారు 10.30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

విషయం తెలిసిన మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ నేతృ త్వంలో బీజేపీ, హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఎమ్మెల్యేను విడుదల చేయాలని డిమాం డ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై నిర సన కొనసాగించారు. హైదరాబాదు నుంచి పిట్లం బిచ్కుంద వైపు వెళ్తున్న బస్సును ఆపి, అద్దంపై చేతితో గుద్దడంతో స్వల్పంగా పగు ళ్లు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. నిర్మల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు వెళ్తుండగా తనను అరెస్టు చేసినట్లు రాజాసింగ్ తెలిపారు.