10 August, 2026 | 4:02 AM

కరీంనగర్‌లో ఉద్రిక్తత

10-08-2026 12:00 AM
  1. కిసాన్ నగర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ వర్గాల ఘర్షణ 
  2. పలువురికి తీవ్ర గాయాలు

కరీంనగర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): కరీంనగర్ కిసాన్ నగర్‌లో ఆదివారం రాత్రి బీజేపీ, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. గత కొంతకాలంగా కిసాన్ నగర్ ప్రాంతంలో బీజేపీ, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఓపెన్ జిమ్ వద్ద విందు చేసుకుంటున్న రెండు గ్రూపుల మధ్య చిన్న వివాదంతో మొదలై బీరు సీసాలతో దాడి చేసే వరకు చేరింది. బీజేపీకి చెందిన శ్రీరామోజు భాను చందర్, మధుకర్, చింటూ, నాగరాజు తదితరులు బీఆర్‌ఎస్‌కు చెందిన శ్రీకాంత్‌పై దాడి చేశారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.