మొసలికి పురోహితుడి పూజలు
10-08-2026 12:00 AM
గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది తీరంలో ఘటన
ఎర్రవల్లి, ఆగస్టు 9: గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన ఓ మొసలి పుష్కర ఘాట్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్న సమయంలో మొసలి నది నుంచి ఘాట్ సమీపానికి వచ్చింది.
అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేశారు. కుంకుమ, పసుపు, పుష్పాలతో పూజలు నిర్వహించారు. మొసలి వరుణదేవుడి వాహనమనే నమ్మకంతో.. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు అనిల్ శర్మ తెలిపారు.






