6 March, 2026 | 11:47 AM

హోర్ముజ్‌లో ఉద్రిక్తత!

06-03-2026 02:41 AM
  1. జలసంధిలోకి భారత్, చైనాను అనుమతిస్తాం
  2. యూఎస్, యూరప్, ఇజ్రాయెల్ నౌకలను నిలిపేస్తాం హోర్ముజ్ జలసంధి రవాణాపై ప్రకటించిన ఇరాన్
  3. నౌకలకు ఎస్కార్ట్ కల్పిస్తామన్న అమెరికా తమ జలసంధిపై అమెరికా పెత్తనమేంటని ఇరాన్ హెచ్చరిక
  4. సముద్ర మార్గంలో నిలిచిపోయిన వందలాది నౌకలు
  5. వివిద నౌకల్లో చిక్కుకున్న 23 వేల మంది భారత సిబ్బంది

హర్మూజ్, ఫిబ్రవరి 4: యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మార్గంలో చమురు రవాణా నౌకలను నిలిపివేస్తున్నట్లు ఇటీవల ఇరాన్ ప్రకటించింది. ఎవరైనా ముందుకు వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. దీంతో ఈ మార్గంలో చమురు రవా ణా నౌకలు పూర్తిగా నిలిచిపోయాయి. హో ర్ముజ్ వద్ద నౌకల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే చమురు నౌకలకు అమెరికా హామీ ఇచ్చింది. నౌకలకు ఎస్కార్ట్ కల్పిస్తామని తెలిపింది.

ఇంతలో తమ జలసంధిపై అమెరికా పెత్తనమేంటని ఇరాన్ స్పందించింది. భారత్ చైనా తోపాటు మరికొన్ని దేశాల నౌకలను అనుమతిస్తామని, యూఎస్, యూరప్, ఇజ్రాయెల్ నౌకలకు ఎంట్రీ లేదని స్పష్టం చేసింది. హార్ముజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయట్లేదని ఇరాన్ ప్రకటించింది. దీంతో భారత్, చైనా సహా మరికొన్ని దేశాలకు భారీ ఊరట లభిస్తుంది. త్వరలోనే భారత్‌షిప్పులు ఈ మార్గం గుం డా బయలుదేరే అవకాశం ఉంది. అయితే యూఎస్, యూరప్, ఇజ్రాయెల్ నౌకలకు ఎంట్రీ లేదని తేల్చిచెప్పింది. ఇప్పటికే యూ ఎస్ చమురు నౌకపై ఇరాన్ దాడి చేసింది.

అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం లో ఇరాన్‌కు చైనా మద్దతుగా నిలుస్తుంది. ఇరాన్‌కు ఆయుధాలు చైనా నుంచి వస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో టెహ్రాన్ పట్ల బీజింగ్ వైఖరికి కృతజ్ఞతగా.. హార్ముజ్ జలసంధి గుండా చైనానౌకలనే  అనుమతించ నున్నట్లు ఇరాన్‌వర్గాలు చెబుతున్నాయి.   యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఈ జలసంధిని అనధికారికంగా మూసివేసింది.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయింది. హార్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ దళాలు హెచ్చరించాయి. ఈ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని, ఒకవేళ దాటేందుకు యత్నిస్తే పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. హార్ముజ్ జలసంధి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతా ర్ వంటి దేశాలకు సముద్ర మార్గాన్ని కల్పిస్తుంది. ప్రపంచచమురు సరఫరాలో  20% చైనా, భారత్ వంటి ఆసియా మార్కెట్లకు వెళ్లే ముందు ఈ మా ర్గం నుంచే వెళ్తుంది.

ట్రంప్ ఎస్కార్ట్ హామీ

హర్ముజ్ గుండా వెళ్లే చమురు నౌకలకు యూఎస్ నేవీ ఎస్కార్ట్ ఇస్తుందని ట్రంప్ అన్నారు. హోర్ముజ్ జలసంధిని ఎక్కువ కా లం దిగ్బంధిస్తే చమురుధరలు భారీగా పెరి గి, దీన్ని ప్రభావం అమెరికాపై పడనుంది.

వందలాది నౌకల్లో 23 వేల మంది భారత సిబ్బంది!

అర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ హెచ్చరికలతో వందలాది నౌకలు సముద్ర మార్గంలోనే నిలిచిపోయాయి. వీటిలో పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో భారత జెండాలున్న 39 నౌకలు ఉన్నట్లు సమాచారం. ఈ జలసంధికి ఇరువైపులా 36 నౌకలు, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో 3 నౌకలు ఉన్నాయి. వీటిలో 12 షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందనవని తెలిసింది.

యా ప్రాంతాల్లో ఉన్న వందలాది నౌకల్లో దాదాపు 23 వేల మంది భారత సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. దీనిపై స్పందించిన షిప్పింగ్ మంత్రిత్వశాఖ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది.