6 March, 2026 | 1:20 PM

అమెరికా ‘డూమ్స్‌డే’ సక్సెస్

06-03-2026 02:42 AM
  1. కాలిఫోర్నియా తీరంలో అణుక్షిపణిని పరీక్షించిన అగ్రరాజ్యం

లక్ష్యాన్ని ఛేదించినట్లు అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడి

క్షిపణికి వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం  

వాషింగ్టన్, మార్చి 5:  పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో  అమెరికా భారీ అణు సామర్థ్యం గల క్షిపణి పరీక్ష  నిర్వహించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా సైన్యం కాలిఫోర్నియా తీరం లో ఉన్న వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుం చి శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌3 డూమ్స్ డే బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్ర యోగించింది. ఈ పరీక్షను అమె రికా సాధారణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిం దని అధికారులు వెల్లడించారు. 

ఈ క్షిపణి పరీక్ష సాంటా బార్బరా సమీపంలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి నిర్వహిం చారు. జీటీ-254 పేరుతో నిర్వహించిన ఈ పరీక్షలో నిరాయుధ రాకెట్‌ను ఉపయోగించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ప్రయోగించిన క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మార్షల్ ఐస్ ల్యాండ్ సమీ పంలోని లక్ష్యాన్ని కచ్చితంగా తాకినట్లు అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడించింది.

అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం 

మినిట్‌మ్యాన్ డూమ్స్‌డే క్షిపణి అమెరికా రక్షణ వ్యవస్థలో కీలక భాగమని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి అణు వార్ హెడ్‌లను మోసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమాపై పడేసిన అణుబాం బుల కంటే 20 రెట్లు శక్తివంతమైన వార్‌హెడ్‌లను మోయగల క్షిపణి అని అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్ష పూర్తిగా రక్షణాత్మక ప్రయోజనాల కోసం నిర్వహించిందని అధికారులు పేర్కొన్నారు.

క్షిపణి వ్యవస్థ కచ్చితత్వం, ప్రభావం, సిద్ధంగా ఉండే చర్యలను పరీక్షించడం ప్రధాన లక్ష్యమని అధికా రులు వివరించారు. అలాగే వివిధ మిషన్ ప్రొఫైల్స్ ద్వారా మినిట్‌మ్యాన్ డూమ్స్ డే  వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికా భూమి ఆధారిత అణు దాడి వ్యవస్థ సిద్ధతను నిర్ధారించుకోవడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రతా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రక్షణ వ్యవస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.