దుప్పితూరులో ఉద్రిక్తత
- ‘బ్రాండిక్స్’ గోడలపై గ్రామస్థుల నిరసన
- అరెస్టు చేసిన పోలీసులు
- భూమి ఇచ్చిన వారికి లాభాల్లో వాటా ఇవ్వాలి
- మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ఏపీలోని అనకాపల్లి జిల్లా దుప్పితూరులో గ్రామంలో బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్ పరిధిలో భాగంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో గ్రామం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడం, దారులను మూసివేయబోయే నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరవై రెండు ఏళ్లుగా పునరావాసం పూర్తిగా జరగకపోయినా, గ్రామాన్ని గోడలతో ముట్ట డి చేయడాన్ని నిరసిస్తూ గ్రామ నిర్వాసితులు ఆందోళనకు దిగారు.
బ్రాండిక్స్ కంపెనీ 60 వేల ఉద్యోగాలు ఇస్తామని, 23వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని మాజీ డీజీపీ, నేషనల్ కోఆర్డినేటర్ అల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ డా. జే. పూర్ణచంద్ర రావు ఆరోపించారు. నిరుపయోగంగా ఉన్న 600 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వకుండా గోడ కట్టడానికి 300 మంది పోలీసులతో బ్రాండిక్స్ సంస్థ రంగంలోకి దిగడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో వారికి అరెస్టు చేయగా.. అక్రమ అరెస్టు ఖండింస్తున్నామని, అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎలమం చిలి నియోజకవర్గం ఎమ్మెల్యే విజయకుమార్ వెంటనే గోడ కట్టడాన్ని ఆపాలని పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. గ్రామం లో జరిగిన సమావేశంలో గ్రామ పెద్దలు, బీసీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాడెం సూరి అప్పారావు మాట్లాడు తూ, సరైన సదుపాయాలు కల్పించకుండా, పునరావాసం పూర్తి చేయకుండా గోడలు కట్టడం అన్యాయం అని అన్నారు. గ్రామ సర్పంచ్ దేవిశెట్టి శంకర్ రావు, పీఏసీఎస్ డివి రమణ మాట్లాడుతూ.. సదుపా యాలు లేకుండా గోడలు ఎందుకు అని ప్రశ్నించారు. సరైన పునరావాసం లేదు, జీవనా ధారానికి హామీ లేదు, ఇప్పుడు దారులు మూసివేస్తున్నారు అని గ్రామస్థులు ప్రశ్నించారు. భూమి ఇచ్చిన బీసీ, ఎస్సీలే అన్యాయం జరుతుగున్నదని పూర్ణచంద్రరావు అన్నారు. భూమి ఇచ్చిన రైతుకు చివరికి దక్కేది ఏమిటి? అని ప్రశ్నించారు. భూమి శాశ్వతంగా పోతుంది. కానీ పరిహారం తాత్కాలికం. లాభం మాత్రం కంపెనీ లకు నిరంతరం వస్తుంది.
అయితే ఆ లాభా ల్లో రైతులకు వాటా ఎందుకు ఉండకూడదు? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు లను ప్రస్తావిస్తూ, భూమి హక్కులు జీవన హక్కుతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. రైతును భూమి నుంచి వేరుచేయడం అంటే అతని జీవనాధారాన్ని దెబ్బతీయడమేనని చెప్పారు.
పరిశ్రమల లాభాల్లో రైతు లకు వాటా ఇవ్వాలని, 25 సంవత్సరాల వార్షిక భృతి కల్పించాలని, కంపెనీల్లో ఈక్వి టీ భాగస్వామ్యం కల్పించాలని, ౠబ్రాండిక్స్ కంపెనీ 60 వేల ఉద్యోగాలు ఇన్స్తా మని 23వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, నిరుపయోగంగా ఉన్న 600 ఎకరా లను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామప్రజలు పెద్దలు పిల్లలు పెద్ద సంఖ్యలో ఆందోళన లో పాల్గొన్నారు. , గోడ నిర్మాణాన్ని వెంటనే నిలిపి, ప్రజలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






