ఓటు తొలగించాలంటే ఆషామాషీ విషయం కాదు
డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫామ్ -6 ద్వారా నమోదు చేసుకోవచ్చు
ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే.. డ్రాఫ్ట్ ఓటరు జాబితా
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా ఎస్ఐఆర్
హైదరాబాద్: ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి(Telangana CEO Sudarshan Reddy) మీట్ ది ప్రెస్ నిర్వహించారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే .. ఫామ్-6 ద్వారా నమోదు చేసుకోవచ్చని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా ఎస్ఐఆర్ చేపడుతున్నామని పేర్కొన్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఎన్యూమరేషన్ పత్రాల(Enumeration of documents) పంపిణీ జరుగుతోందన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు అందిస్తున్నామని సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ప్రతి వ్యక్తి కి రెండు ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తామని సూచించారు.
రెండూ ఎన్యూమరేషన్ పత్రాలు నింపి.. ఒకటి బీఎల్ వోకు(Booth Level Officer) ఇవ్వాలని, రెండో ఎన్యూమరేషన్ పత్రాన్ని ప్రజల దగ్గరే ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే.. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఉంటుందని వెల్లడించారు. ఒక వేళ ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వలేకపోతే ఫామ్ -6 ఇవ్వాలన్నారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే.. ఫామ్ -6 ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఈసీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లోనూ ఎన్యూమరేషన్ పత్రాలు నింపవచ్చని సూచించారు. ఓటును కావాలనే తొలగించరు.. అలా తొలగించాలంటే ఆషామాషీ విషయం కాదని పేర్కొన్నారు. ఓటు తొలగించే ముందు.. సంబంధించిన ఓటరకు సమాచారం ఇచ్చే తీసెయ్యాయని సూచించారు.






