3 May, 2026 | 4:04 AM

మేడ్చల్‌లో జిల్లా, సెషన్ కోర్టు హాల్ ప్రారంభం

03-05-2026 12:00 AM

ముఖ్య అతిథులుగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు 

మేడ్చల్, మే 2 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన జిల్లా, సెషన్ కోర్టు హాలు ను శనివారం హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ రిబ్బన్ కట్ చేయగా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయ్ సేన రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అనంతరం నూతనం గా నిర్మించిన కోర్టు హాలులోని సౌకర్యాలను, న్యాయమూర్తుల చాంబర్లను పరిశీ లించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కక్షిదారులకు, న్యాయవాదులకు మెరుగైన వసతు లు కల్పించడంతో పాటు న్యాయ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు నూతన కోర్టు హాలును నిర్మించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా న్యాయమూర్తులు, కలెక్టర్ మను చౌదరి, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.