స్మైల్ సొసైటీ సేవలు అభినందనీయం
10-07-2026 04:04 PM
తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): విద్యార్థులకు స్మైల్ సొసైటీ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలు చాలా గొప్పవాని ఎంపీడీవో గడ్డం గోపాలకృష్ణా రెడ్డి, సర్పంచ్ కేశవులు అన్నారు. శుక్రవారం భీంపూర్ మండలం టెక్డీ గూడ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి వారు అందజేశారు. ఇందులో భాగంగా పిల్లలకు బ్యాగులు, పెన్నులు, నోట్ పుస్తకాలు, పెన్సిల్, వాటర్ బాటిల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో స్మైల్ సొసైటీ అధ్యక్షుడు కేమా శ్రీకాంత్, కార్యదర్శి జలంధర్, సభ్యులు మహ్మద్ రఫీ, సాయి గౌడ్, షేక్ నజ్జు, రవీందర్ రాథోడ్, ఉపాధ్యాయుడు రాధా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.






