1 March, 2026 | 4:57 AM

బల్మూరులో టెన్షన్ టెన్షన్!

01-03-2026 01:40 AM

కాంగ్రెస్ X బీజేపీ

గ్రామకంఠం భూ వివాదంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రగడ

తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముందే మాజీ ఎంపీటీసీపై దాడి చేసిన ఉప సర్పంచ్

ఉప సర్పంచ్ అరెస్టుతో బల్మూర్ బంద్‌కు బీజేపీ పిలుపు

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతల మధ్య గ్రామకంఠం భూమి చిచ్చు పెట్టింది. గ్రామంలోని సర్వే నెంబర్ 28లో సుమారు ఎకరం గ్రామకం ఠం భూమిని గతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం కేటాయించారు. అనంతరం వాటిలో నిర్మాణం చేయకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో అట్టి భూమిని ఆట స్థలం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుందని తెలుస్తోంది.

ఈ విషయంలోనే అట్టి గ్రామ కంఠం భూమిని ప్రస్తుతం గెలుపొందిన సర్పంచ్ వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కాగా కొందరు అ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఈ నేపథ్యంలోనే అట్టి భూమిని అభివృద్ధికి వినియోగించాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసేందుకు బీజేపీకి చెందిన ఉప సర్పంచ్ సీతారాంరెడ్డి ఫిబ్రవరి 26న ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాడు. కానీ అప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ ఖదీర్ అక్కడే ఉండటంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగింది.

దీంతో తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి ముందే ఆయన ఛాంబర్‌లోనే ఖదీర్‌పై శ్రీకాంత్‌రెడ్డి దాడికి దిగాడు. వద్దని వారించినా నిలువరించినా వెనక్కి తగ్గకపోవడంతో తన విధులకు ఆటం కం కలిగించారన్న ఉద్దేశంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు సీతారాంరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనతో బల్మూరు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సీతారాంరెడ్డిపై తప్పుడు కేసులు ఎత్తివేస్తూ విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వేము ల నరేందర్‌రావు బల్మూర్ బందుకు పిలుపునిచ్చారు. ఇందుకు పోలీసులు నిరాకరించిన ప్పటికీ శనివారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నా లో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.