ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడదాం: మంత్రి దామోదర
తొమ్మిది నుంచి ౧౪ ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించి, వారి ఆరోగ్యాన్ని కాపాడదామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో శనివారం ఆయన హెచ్‌పీవీ వ్యాక్సినే షన్ డ్రైవ్‌ను ప్రారంభించి మాట్లాడారు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాలతో మహిళలకు చిన్న వయస్సులోనే గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, ఆ ముప్పును నివారించేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో యేటా 60,000 వరకు గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య మరో 10 శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని వెల్లడించారు.
ఈ తరుణంలో తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. వ్యాక్సిన్ నెల రోజుల వరకు అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. తమ ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సా నిపుణుడు నోరి దత్తాత్రేయుడిని సలహాదారుగా నియమించుకుని, ఆయన సలహాలు, సూచనలతో రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల కట్టడికి కృషి చేస్తున్నామని వివరించారు.
గర్భాశయ క్యా న్సర్ నివారణకు రాష్ట్రవ్యాప్తంగా 3.5 4 లక్షల మంది బాలికలకు వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లభించించే ‘గార్డాసిల్’ వ్యాక్సిన్ ధర 3,000 నుం చి 4,000 ఉంటుందని, కానీ.. ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పాల్గొన్నారు.




