25 July, 2026 | 1:01 AM

లొద్ది మల్లయ్య జాతరకు అనుమతి

25-07-2026 12:02 AM

యూటర్న్ తీసుకున్న అటవీ శాఖ 

అచ్చంపేట, జూలై 24(విజయక్రాంతి): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ప్రతి ఏటా నిర్వహించే లోద్ది జాతరపై అటవీ శాఖ యూ టర్న్ తీసుకుంది. జాతరకు భక్తులు వచ్చేందుకు అనుమతిచ్చింది. మొద టి జాతరకు భక్తులను అనుమతించ లేదని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రకటించడంతో భక్తులు నిరాశ చెందారు. పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అమల్లో ఉన్న మూడు నెలల సీజనల్ క్లోజర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. భక్తుల నుంచి  నిరసన రావడంతో లోద్ది జాతరకు వచ్చేందుకు అనుమతిచ్చింది.